GNTR: పాతగుంటూరులోని బాలాజీనగర్ జీరో లైన్లో పారిశుద్ధ్య సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. వెంకట్రామా థియేటర్ వెనుక ఇళ్ల మధ్య పందుల పెంపకం కొనసాగుతుండటంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. పలు మార్లు ఫిర్యాదు చేసినా చర్యలు కనిపించలేదని, అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.