CTR: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదని జడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రెడ్డప్ప రెడ్డి తెలిపారు. సదుంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు గురువారం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టో పత్రాలను దగ్ధం చేశారు. ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.