SKLM: జిల్లా మత్స్యకారుల చిరకాల స్వప్నమైన బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 444.75 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మువ్వా తిరుమల కృష్ణబాబు బుధవారం జీవో నంబర్-15 జారీ చేశారు.