కోనసీమ: మండపేట పట్టణం 11వ వార్డులో ఎస్సీఎస్పీ నిధులు రూ.60 లక్షలతో చేపట్టనున్న 13 డ్రైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.