మణిపూర్లో గత రెండు వారాలుగా జరిగిన వరుస హింసాత్మక ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మిజోరం ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలను కట్టడి చేసి సాధారణ స్థితికి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ ఘటనలో తమ వారిని కోల్పోయిన, గాయపడిన వారి కుటుంబాలకు మిజోరాం ప్రభుత్వం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపింది.