WGL: పెట్టుబడిదారీ వ్యవస్థకు కాలం చెల్లిందని, కమ్యూనిజమే ప్రత్యామ్నాయంగా ఎర్రజెండా వైపు ప్రపంచ యువత చూస్తున్నదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. నల్లబెల్లి మండల కేంద్రంలో బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ వరంగల్ జిల్లా రాజకీయ శిక్షణ శిబిరాలను నిర్వహించారు.