వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, కలెక్టర్లు సత్య శారద, చాహత్ బాజ్పాయ్, తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రి అభివృద్ధి పనులు, వైద్య సేవల నాణ్యత, రోగులకు సౌకర్యాలు, మౌలిక వసతుల మెరుగుదలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.