TPT: రేణిగుంట (M) మామండూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మాధవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. కడప నుంచి వస్తున్న సిమెంట్ కాంక్రీట్ లారీ, చెన్నై నుంచి వస్తున్న మరో లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన డ్రైవర్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.