E.G: కొవ్వూరు వైసీపీ క్యాంపు కార్యాలయంలో ‘వెన్నుపోటుకి రెండేళ్ళు’ పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు వైసీపీ ఇంఛార్జ్ తలారి వెంకట్రావు బుధవారం ఆవిష్కరించారు. గత ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేసి, చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.