TG: సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకు బయలుదేరారు. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి రేవంత్ హాజరుకానున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు డీకే ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు 13 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. అలాగే ఒక డిప్యూటీ సీఎం కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.