ASR: కొయ్యూరు మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా పోస్టులకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కాల్ లెటర్స్ కోసం ఈనెల 5న కొయ్యూరు ఐసీడీఎస్ కార్యాలయానికి రావాలని సీడీపీవో దేవమణి బుధవారం తెలిపారు. కాల్ లెటర్స్ తీసుకున్న అభ్యర్థులు ఈనెల 17వ తేదీ బుధవారం పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో హాజరుకావాలన్నారు. వారికి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.