ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు వానాకాల పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల వాతావరణంలో మార్పులు, వర్షాలపై ఆశాభావంతో పొలాల్లో దుక్కులు దున్నే పనులు ప్రారంభించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సాగు పనులు దాదాపు 20 రోజుల ఆలస్యంగా మొదలైనట్లు రైతులు చెబుతున్నారు. వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్ల వినియోగం పెరగగా, విత్తనాలు, ఎరువుల సేకరణలోనూ రైతులు నిమగ్నమయ్యారు.