SRPT: నడిగూడెం మండలం చెన్నకేశపురం గ్రామంలో ఇవాళ ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేరా యువభారత్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథి దున్న సతీష్ మాట్లాడుతూ యువత సైక్లింగ్‌ను దినచర్యలో భాగం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు.