NDL: బనగానపల్లె పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు వాల్ పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలతో ఓట్లు వేయించుకొని ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలుపరచాలని ఆయన పేర్కొన్నారు.