సీఎం కేసీఆర్ కొత్త పార్టీ పెట్టడంపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాదు కదా…ఆయన తాత వచ్చినా తమకు ఏ నష్టం ఉండదని వెల్లడించారు. సీఎం జగన్ సింహం లాంటి వారని…అందరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదన్నారు.
అయినా కూడా తామే అత్యధిక మెజారిటీతో గెలుస్తామని చెప్పారు. అసలు మా పార్టీకి వ్యతిరేక ఓట్లే లేవని మంత్రి కారుమూరి అన్నారు. పవన్ కల్యాణ్ చెబుతున్నట్లు తమ ఓట్లు చీలే అవకాశమే లేదని స్పష్టం చేశారు.