SBI రుణాలు మరింత భారం కానున్నాయి. MCLR రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. MCLRను 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. సవరించిన రేట్లు నేటి నుంచే అమలవుతాయని పేర్కొంది. మూడు నెలల కాలవ్యవధిపై MCLRను 8.50 శాతం నుంచి 8.55 శాతానికి పెంచింది. ఆరు నెలలకు 8.85 శాతం నుంచి 8.90 శాతానికి చేరింది. కీలకమైన రిటైల్ రుణాలను ప్రభావితం చేసే ఏడాది కాలవ్యవధి MCLRను 8.95 శాతం నుంచి 9 శాతానికి పెంచారు.