AP: DSC నియామకాలపై అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం వెంటనే నివృత్తి చేయాల్సిందేనని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ‘నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి చిన్న ఆరోపణ కూడా రాకుండా 10 వేల టీచర్ ఉద్యోగాలు, 2 లక్షల సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేశాం. అలాంటిది ఇప్పుడు టీచర్ ఉద్యోగాలను అమ్మకానికి పెట్టిన వారిని దోషులుగా ఎందుకు నిలబెట్టలేదు..?’ అని విమర్శలు చేశారు.