GDWL: ఎర్రవల్లి మండలం ధర్మవరంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ఇద్దరు మహిళా కూలీలకు పాముకాటు వేసింది. సకినాబేగం, పుల్లమ్మ అనే కూలీలు అస్వస్థతకు గురికావడంతో తోటి కార్మికులు అప్రమత్తమయ్యారు. పంచాయతీ కార్యదర్శి నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ సాయిబాబా స్పందించి 108 అంబులెన్స్‌లో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.