HYD ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే మిర్చౌక్ పరిధిలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎస్.జె. రోటరీ నుంచి MGBS వరకు ట్రాఫిక్ రద్దీని పరిశీలించి, అక్రమ ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. దబీర్పురా దర్వాజా వద్ద వర్షాకాలంలో నీరునిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.