WGL: రాయపర్తి మండలంలోని భుర్హాన్ పల్లి(నాను)తండా, జాతురం తండా గ్రామాలలో దుర్గమ్మ తల్లి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.