RR: షాద్నగర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా సి. స్వప్న మంగళవారం బాధ్యతలు చేపట్టారు. నల్గొండ నుంచి బదిలీపై వచ్చిన ఆమె, ఇక్కడ పనిచేస్తున్న వాసు స్థానంలో నియమితులయ్యారు. గతంలో గద్వాల డివిజన్లో పనిచేసిన స్వప్న, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.