AP: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలు, అఖండ గోదావరి ప్రాజెక్టుపై మంత్రుల కమిటీతో CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దీనిపై పవన్ కళ్యాణ్ సూచనలను పరిగణలోకి తీసుకొని పనిచేయాలన్నారు. రాజమహేంద్రవరం మెగాసిటీగా మారేలా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. పుష్కరాలకు 6 జిల్లాల్లోని 525 ఘాట్లను సిద్ధం చేయాలన్న ప్రభుత్వం.. ఇప్పటికే రూ.212 కోట్ల విలువైన పనులకు అనుమతి ఇచ్చింది.