MDK: పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటూ యువత ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ కోరారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల వద్ద పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, అధికారులు పాల్గొన్నారు.