కోనసీమ: అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోని దళిత కాలనీల్లో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మంచినీటి సమస్య పరిష్కారానికి రూ.1 కోటి నిధులతో పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. నీటి శుద్ధి యూనిట్లు, పైప్లైన్ అనుసంధాన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.