TPT: సత్యవేడు ఐసీడీఎస్ పరిధిలోని మూడు మండలాలకు చెందిన 31 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు నియామక పత్రాలను జడ్పీటీసీ సభ్యురాలు కూరపాటి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు. కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో పారదర్శకంగా నియామకాలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. కొత్తగా నియమితులైన సిబ్బంది పిల్లలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.