TG: ఆదివాసీలకు నూటికి నూరు శాతం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏ ఒక్క పేదవాడు గుడిసెలో ఉండకూడదనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆయన తెలిపారు. ఇళ్ల మంజూరులో ఎలాంటి రాజకీయ పార్టీలను చూడబోమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో గూడెంలో ఒక్క గుడిసె కూడా ఉండటానికి వీల్లేదని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు.