AKR: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)లో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా 52 ఫిర్యాదులను స్వీకరించారు. భూ, ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు, మోసపూరిత ఘటనలకు సంబంధించిన వినతులు అధికంగా నమోదయ్యాయి. ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి 7 రోజుల్లో న్యాయం చేయాలని ఆదేశించారు.