NLG: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఏమాత్రం జాప్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 43, ఇతర శాఖలకు చెందిన 75 కలిపి మొత్తం 118 ఫిర్యాదులు బాధితుల నుంచి వచ్చాయని తెలిపారు.