KMR: రైతులు పండించిన జొన్నలను ఆంక్షలు లేకుండా కొనుగులు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది. బయోమెట్రిక్ విధానం తీసుకురావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. జొన్నల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పిట్లం మండల కేంద్రంలో సోమవారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు.