కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 16 దరఖాస్తులు అందాయి. నగరంలోని వివిధ డివిజన్ల ప్రజల నుంచి వచ్చిన వినతులను కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ స్వీకరించారు. వాటిలో ఇంజినీరింగ్‌కు 2, టౌన్ ప్లానింగ్‌కు 5, రెవెన్యూకు 6, పెన్షన్‌కు 1, పారిశుద్ధ్య విభాగానికి 2 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.