SRPT: సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు. వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. వేదిక నిర్మాణం, ఇతర కార్యక్రమాలపై అధికారులకు తగిన సూచనలు చేశారు.