AP: విజయవాడలో ఓ సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థలం ఆక్రమించి భూ యజమాని ఉమామహేశ్వర శాస్త్రిని చంపేందుకు సుపారీ ఇచ్చినట్టు గుర్తించారు. చిల్లకల్లుకు చెందిన వ్యక్తికి రూ.24 లక్షల సుపారీ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో గ్యాంగ్‌లోని నలుగురిని సత్యనారాయణపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, వైసీపీ నేత గౌతంరెడ్డి సుపారీ ఇచ్చారని భూ యజమాని ఆరోపించారు.