భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న జోడీ ఏటీపీ ఫైనల్స్లో వరుసగా రెండో ఓటమి చవిచూసింది. సెకండ్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో 7-5, 6-3 తేడాతో టాప్ సీడ్ మార్సెలో అరెవలో, మటె పావిక్ ద్వయం చేతిలో ఓడిపోయింది. ఫస్ట్ సెట్లో బోపన్న, ఎబ్డెన్లు ఆరంభంలో దూకుడుగా ఆడినా ఆ తర్వాత ఆ జోరును కొనసాగించడంలో విఫలం అయింది. ఇక సెకండ్ సెట్లో ప్రత్యర్థులదే హవా కొనసాగింది.