JGL: సన్నరకం వరి ధాన్యం కొనుగోలు సమయంలో నిర్వాహకులు నిబంధనలు పాటించాలని జిల్లా మార్కెటింగ్ అధికారి జితేందర్ ప్రసాద్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి, అంతర్గాం, ధరూర్ గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. సన్న రకం వరి ధాన్యాన్ని కొలిచే పరికరాన్ని నిర్వాహకులకు అందించారు. ఆయన వెంట ఏపీఎం ఓదెల గంగాధర్, పాల్గొన్నారు.