ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ సంస్థను కూట్నీతి ఫౌండేషన్ ‘మేక వన్నె పులి’గా పేర్కొంది. స్టార్‌లింక్‌కు అమెరికా నిఘా విభాగం, మిలిటరీ సంస్థలతో బలమైన సంబంధాలు ఉన్నాయని, దీంతో దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. కాగా.. స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు భారత్‌లో ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.