TG: ప్రియురాలిని చంపి ముక్కలు ముక్కలుగా నరికి పొలంలో పూడ్చి పెట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. మాచినేనిపేటలో వీరభద్రం అనే వ్యక్తి స్వాతి అనే అమ్మాయిని మూడు రోజుల క్రితం చంపి గోనె సంచిలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టాడు. గతంలో వీరిద్దరు సింగరేణిలో జాబ్ ఇప్పిస్తామని ఓ జంట నుంచి రూ. 16 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు సమాచారం. ఈ విషయంలోనే వీరి మధ్య విబేధాలు వచ్చి ఈ హత్యకు కారణం అయినట్లు తెలుస్తోంది.