అవిసె గింజలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ గింజల్లో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటి వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ముఖ్యంగా పెద్ద ప్రేగు, చర్మం, బ్లడ్, లంగ్ క్యాన్సర్స్ రాకుండా నివారిస్తుంది. గుండె సమస్యలు, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అవిసె గింజలు తగ్గిస్తాయని నిపుణులు సుచిస్తున్నారు.