TG: ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వ శాఖలకు వస్త్రాల సరఫరా త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చేనేత, జౌళి శాఖపై ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. టెస్కో నుంచి సంఘాల ద్వారా వస్త్రాల ఉత్పత్తి కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ ఎండీ శైలజా రామయ్యర్కు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 96.03 లక్షల మీటర్ల వస్త్రాల ఉత్పత్తి కోసం సంఘాలకు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపారు.