TPT: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొకే అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం తనకు విప్ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరింత బాధ్యతగా పనిచేస్తానని, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు.