ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా ప్రాంతంలో వివాహ వేడుకల్లో చోరీలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి, దొంగతనాలను కట్టడి చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. వివాహ వేదికల వద్ద ప్రత్యేక బృందాలను మోహరించనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. సాధారణ దుస్తులు ధరించి.. కుటుంబ సభ్యుల్లానే పెళ్లిళ్లకు హాజరవుతారని పేర్కొన్నాారు.