»Nithyanandas Fictional Nation Of Kailasa Worms Way Into Un Panel Discussion
United States of KAILASA: ఐక్యరాజ్య సమితిలో నిత్యానంద ప్రతినిధులు!
పరారీలో ఉన్న స్వయంప్రకటిత గాడ్-మ్యాన్ నిత్యానంద కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకు (United States of KAILASA) చెందిన ప్రతినిధులు జెనీవాలో స్థిర అభివృద్ధిపై చర్చ సందర్భంగా పాల్గొన్నట్లుగా వార్తలు వచ్చాయి.
పరారీలో ఉన్న స్వయంప్రకటిత గాడ్-మ్యాన్ నిత్యానంద కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకు (United States of KAILASA) చెందిన ప్రతినిధులు జెనీవాలో స్థిర అభివృద్ధిపై చర్చ సందర్భంగా పాల్గొన్నట్లుగా వార్తలు వచ్చాయి. తద్వారా వరల్డ్ ఆర్గనైజేషన్ ఐక్య రాజ్య సమితి (united nations organisation) తమను గుర్తించిందనే తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించే ప్రయత్నం చేశాడు నిత్యానంద. ఫిబ్రవరి 24న ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ (Committee on Economic, Social and Cultural Rights-CESCR) నిర్వహించిన సుస్థిర అభివృద్ధిపై జరిగిన సాధారణ చర్చలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (United States of KAILASA)కు చెందిన ఇద్దరు… ప్రజా స్పందనలో భాగంగా మాట్లాడారు. ఐక్య రాజ్య సమితి గుర్తించిన 193 దేశాలలో నిత్యానందకు చెందిన USK లేదు. దేశానికి గుర్తింపు రావాలంటే భద్రతా మండలి, జనరల్ అసెంబ్లీ.. రెండింటి ఆమోదం అవసరమయ్యే క్లిష్ట నియమాలు ఉన్నాయి. జెనీవాలోని (Geneva) ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల సంస్థలు.. ప్రజలను తమ ఓపెన్ సెషన్ లలోకి రావడానికి, అక్కడ మాట్లాడటానికి అనుమతిస్తాయి. ప్రజలు, సంస్థలు తమ విధానాలను సమర్పించేందుకు వీలు కల్పిస్తాయి.
అత్యాచారం, అపహరణ అభియోగాలు ఎదుర్కొంటున్న నిత్యానంద 2019లో భారత్ నుండి పారిపోయాడు. అతనిపై కోర్టు అరెస్ట్ వారెంట్ ఉంది. భారత్ నుండి పారిపోయాక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసను స్థాపించాడు. ఇది సెంట్రల్ అమెరికాలోని పసిఫిక్ తీరంలో ఉన్న ఒక ద్వీపం. రెండు బిలియన్ల మంది హిందువులకు తాము ప్రతినిధులమని చెబుతున్నాడు. తమ దేశానికి గుర్తింపు కావాలని చెబుతున్నాడు. ఇదే సమయంలో ఫిబ్రవరి 24వ తేదీన సుస్థిర అభివృద్ధి, లీగల్ అంశాలు, పేదరికం, కార్మిక ప్రమాణాలపై సాధారణ చర్చ జరగగా, ఈ సెషన్ కు మొహమ్మద్ అబ్డెల్ మొనీమ్ అధ్యక్షత వహించాడు. సభ్యుడు పీటర్ ఎమూజ్ మోడరేట్ చేశాడు. ఈ సందర్భంగా ప్రజాస్పందనలో భాగంగా ఇద్దరు నిత్యానంద దేశం ప్రతినిధులు చర్చలో అభివృద్ధి సమస్యలపై మాట్లాడారు.
తలపాగా చుట్టి, నుదుటిన బొట్టు పెట్టి, ఆభరణాలు ధరించిన నిత్యానంద దేశానికి చెందిన విజయప్రియ నిత్యానంద మాట్లాడింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస గురించి మాట్లాడారు. తమ దేశంలో ప్రాథమిక అవసరాలైన కూడు, గుడ్డ, దుస్తులు, విద్య, వైద్యం ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పింది. మొదట కైలాస దేశ విశిష్టతను వివరించింది. కైలాస దేశం హిందువుల కోసమే ఏర్పడిన మొట్టమొదటి సార్వభౌమ దేశం అని పేర్కొన్నది. తమ దేశాధినేత పేరు నిత్యానంద పరమశివం అని, నిత్యానంద పరమశివం పరమావధి హిందూ మత పునరుజ్జీవం అని స్పష్టం చేసింది. అలాగే, నిత్యానందను భారత ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని విషం కక్కారు.
ఇదిలా ఉండగా, వారి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ కైలాసాస్ ఎస్పీహెచ్ నిత్యానంద (KAILASA’s SPH Nithyananda) ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి, తమకు గుర్తింపు లభించినట్లుగా చెప్పే ప్రయత్నం చేసింది. జెనీవాలోని ఐక్య రాజ్య సమితిలో తమ ప్రతినిధులు అంటూ ఒక్కో దేశం ప్రతినిధి ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఐక్య రాజ్య సమితి కైలాస శాశ్వత అంబాసిడర్ గా విజయప్రియ నిత్యానందను పేర్కొన్నారు. ఇప్పుడు ఈ పోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ గా మారాయి.