»Will Female Robots Be Used For Purposes In The Future
Robots : ఆడ రోబోలను భవిష్యత్తులో సెక్స్ అవసరాలకు వాడుతారా?
ఈ రోబోలు అన్నింటిలో ఉమ్మడిగా ఒక పోలిక ఉంది. డిజైన్ పరంగా చూస్తే ఇవన్నీ అమ్మాయిలు. ఈ రోబోల రూపకర్తలు వీటికి స్త్రీ లక్షణాలను ఇవ్వాలని ఎందుకు నిర్ణయించుకున్నారనేది ఇప్పుడు ప్రశ్న
ఆడ రోబోలను భవిష్యత్తులో సెక్స్ అవసరాలకు వాడుతారా రోబోలు (Robots) అన్నింటిలో ఉమ్మడిగా ఒక పోలిక ఉంది. డిజైన్ పరంగా చూస్తే ఇవన్నీ అమ్మాయిలు. ఈ రోబోల రూపకర్తలు వీటికి స్త్రీ లక్షణాలను ఇవ్వాలని ఎందుకు నిర్ణయించుకున్నారనేది ఇప్పుడు ప్రశ్న. లింగ వివక్ష కారణంగానే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాయిస్ సిస్టమ్’ రోబోలకు మహిళా రూపం ఇస్తారనే వాదన తరచుగా వినిపిస్తుంది. అయితే, దీనికి మరో కారణం కూడా ఉంది. డిజైనర్లు (Designers) తమను పోలి ఉండే రోబోలను తయారు చేస్తుండడం. ఆడవాళ్ళయితే ఆడ రోబోనే చేస్తున్నారని కూడా చెబుతుంటారు.నాడిన్ రోబో (Nadine robot) గురించి మాట్లాడుకుంటే, దాని రూపకర్త ఒక మహిళ. ఆమె పేరు నాడియా మాగ్నెనాట్ థల్మాన్. తనను తాను ఒక ‘రోబో సెల్ఫీ’గా నాడియా చెప్పుకుంటారు.ప్రపంచంలోని తొలి అల్ట్రా రియలిస్టిక్ హ్యుమనాయిడ్ ఆర్టిస్ట్ రోబో పేరు ‘‘ఐడా’’. ప్రపంచంలోని తొలి నర్సింగ్ అసిస్టెంట్ రోబో పేరు ‘గ్రేస్’.ఐడా, గ్రేస్‌లతో పాటు సోఫియా(Sofia), నాడిన్, మికా, డెస్డెమోనా (రాక్‌స్టార్ రోబో)లు కూడా ఉన్నాయి.
ప్రపంచ సమస్యల పరిష్కారంలో ఏఐ సహకారాన్ని ప్రోత్సహించడం’’ పేరుతో జెనీవా వేదికగా జులైలో ఐక్యరాజ్యసమితి (UNO) ఒక సదస్సును నిర్వహించింది.ఈ సదస్సుకు హ్యుమనాయిడ్ రోబోలను హాజరుపర్చారు. అతిపెద్ద హ్యుమనాయిడ్ రోబోల సమ్మేళనంగా ఈ సమావేశాన్ని అభివర్ణించారు.ఇందులో పైన పేర్కొన్న ఆడ రోబోలతో పాటు జెమినాయిడ్ (Geminoid)అనే మగ రోబో కూడా పాల్గొంది. దీని డిజైనర్ పురుషుడు. ఆయన పేరు హిరోషి ఇషిగురో.సదస్సులో కీలక ప్రసంగం వెలువరించిన వారిలో ‘ఐడా’ ఒకరు. ఐడా రోబో ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక కళాకారిణి. అంటే బొమ్మలు గీయడం, పెయింటింగ్ (Painting) వేయడం, శిల్పాలు చెక్కడంతో పాటు ఇది ప్రదర్శనలు కూడా ఇస్తుంది.కళ, సాంకేతిక రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటుంది. అణగారిన (underrepresented) వర్గాల గొంతును సమర్థంగా వినిపించాలని మేం కోరుకున్నాం’’ అని ఆమె తెలిపారు