VZM: గజపతినగరంలో అక్రమంగా నిల్వ ఉంచిన మందు గుండు సామాగ్రిని పోలీసులు పట్టుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా బాణాసంచా నిల్వ ఉంచినట్లు వచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించి చైతన్య అనే వ్యక్తి వద్ద నుంచి మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు. వీటి విలువ సుమారు 40 వేల రూపాయలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.