TG: లగచర్ల ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కలెక్టర్‌పై దాడి కేసులో ఇప్పటివరకు 55 మంది అరెస్టవగా.. 39 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన 16మందిని పరిగి సబ్ జైలులో ఉంచారు. కొండగల్ పరిధిలో ఇంటర్నెట్ బంద్ కొనసాగుతోంది. ఈ ఘటనలో కీలక సూత్రధారి భోగమోని సురేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న BRS మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టయ్యారు.