HNK: జిల్లా అభివృద్ధి సహకార, మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం బుధవారం జిల్లా కలెక్టరేట్లో జరగనుందని కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11:30 గంటలకు కలెక్టరేట్లో దిశ కమిటీ ఛైర్మన్ వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆధ్వర్యంలో జరగనుంది. సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల ప్రగతి నివేదికలను సమీక్షిస్తారని పేర్కొన్నారు.