ఇరాన్‌తో యుద్ధం వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆ దేశ ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. ఖమేనీ పాలన ఇజ్రాయెల్ కంటే ఇరాన్ ప్రజలనే ఎక్కువ భయపెడుతోందని తెలిపారు. ఇరాన్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ వదులుకోవద్దని సూచించారు. కాగా, గతంలో ఇరాన్ పౌరులకు సంఘీభావంగా మాట్లాడిన ఆయన.. ఆ దేశ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.