రిటైల్ ధరలు ఆకాశాన్ని తాకటంతో అక్టోబర్లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్టానికి చేరింది. గత నెల 6.21% ఉండగా.. చివరిసారి 2023 ఆగస్టులో గరిష్టంగా 6.83% రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైంది. కూరగాయలు, పండ్లు, నూనెలు వంటి పదార్థాల ధరలు పెరగటమే అధిక ద్రవ్యోల్బణానికి కారణమని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (NSO) వెల్లడించింది. గ్రామీణం-6.68%, పట్టణ ప్రాంతాల్లో 5.62% రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైనట్లు పేర్కొంది.