ప్రకాశం: ఒంగోలు డీఎల్డీవో ఉషారాణిని రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు డీపీవోగా ఉషారాణి బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీనిపై త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టి ఆమెపై చర్యలు తీసుకున్నారు.