W.G: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో తీర ప్రాంతానికి మరో పదవిని కట్టబెట్టింది. అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా నరసాపురం మండలంలోని వేములదీవి గ్రామానికి చెందిన వాతాడి ఉమామహేశ్వరరావును నియమించినట్లు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సందర్భంగా ఉమా మాట్లాడుతూ అగ్నికుల క్షత్రియుల అభివృద్ధికి పాటుపడతానని అన్నారు.