WG: భీమవరం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం గ్రామీణ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై జిల్లాలో వివిధ చిన్న తరహా పరిశ్రమల వ్యవస్థాపకులను ప్రోత్సహించే దిశగా అందించే సాయంపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో షెడ్యూల్డ్ తెగలకు చెందిన యానాది, ఎరుకల కుటుంబాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన సహాయ అందించాలన్నారు.